సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో పేద మధ్యతరగతి ప్రజలు కు వైద్యసేవలు ఉచితంగా అమలు చెయ్యడానికి ఏర్పాటు చేసిన ఆరోగ్యశ్రీ పధకం అమలు చేస్తున్న ప్రెవేటు ఆస్పత్రులకు బిల్లులు చెల్లింపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తున్నందుకు నిరసనగావచ్చే ఏప్రిల్ 7 నుంచి సేవలు పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఆంధ్ర ప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆషా) ప్రకప్రటించింది. ఈ మేరకు ప్రభు ప్ర త్వానికిసమ్మె నోటీసు అందచేసినట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఏకంగా ప్రభుత్వం నుండి 3500 కోట్ల రూపాయల బిల్లుల బకాయిలు ఉన్నాయని, తక్షణం వాటిలో కనీసం 1500 కోట్ల బకాయిలు విడుదల చేస్తే సమ్మె ఆలోచన పునరాలోచిస్తామని ఆషా సంస్థ ప్రెసిడెంట్ డాక్టర్ కే విజయకుమార్ ఒక ప్రకటనలో మీడియా కు తెలిపారు.
