సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: గత తెలుగు దేశం ప్రభుత్వం హయాంలో పనిచేసిన ఐ ఏ ఎస్ అధికారి, లక్ష్మి నారాయణ, స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతొ ఏపీఎస్‌ఎస్‌డీసీ నిధులు రూ.241 కోట్లు రూపాయలు షెల్ కంపినీల పెట్టి దోచుకొన్నారని ఆధారాలు దొరికాయని, సీఐడి పోలీస్ దర్యాప్తు జరుగుతున్నా సమయంలో సీఐ డి పోలీసులు వెళ్ళినపుడు అయన నివాసం వద్ద ఉన్న ఏబీఎన్ రాధాకృష్ణపై జీరో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. విచారణ జరుగుతున్నా సమయంలో తమ విధులకు ఆటంకం కలిగించినందుకు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు సీఐడీ పేర్కొంది. అవినీతికి పాల్పడ్డ వారి ఇళ్లల్లో అధికారులు దర్యాప్తు చేస్తుండగా రాధాకృష్ణ తమను అడ్డుకోవడానికి యత్నించడంతో తీవ్ర ఒత్తిడి మధ్య నే సీఐడీ అధికారులు పంచనామా పూర్తి చేశామన్నారు. తాజా వార్త సమాచారం ప్రకారం...ఐపీసీ 353, 341,186, 120(బి) సెక్షన్ల కింద ఏబీఎన్ రాధాకృష్ణపై కేసు నమోదైంది. కేసు తదుపరి విచారణ కోసం తెలంగాణకు సీఐడీ బదిలీ చేయనుంది.
