సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అలా ఈసారి దీపావళి పండుగకు వీడ్కోలు పలికి తెల్లవారుతుందో లేదో తెలుగు రాష్ట్రాలలో తెల్లవారు జామునుండి లెక్కనేనన్ని మరణాలు, యాక్సిడెంట్స్ , దహనాలు ఇలా ఎన్నో ఒక్కపూటలో జరిగిపోయాయి. పూర్తీ సమాచారం ఇవ్వలేని ఎన్నో ఘోరాలు జరిగాయి. భీమవరం పట్టణంలో టౌన్ రైల్వే స్టేషన్ పరిధిలో రైల్వే ట్రాక్ లో కిలోమీటర్ పరిధిలో 3 చోట్ల వేరువేరుగా నేటి తెల్లవారు జామున ముగ్గురు బలి అవ్వడం సంచలనమ్ రేపితే.. కాకినాడ జిల్లాలో పలు రోడ్డు యాక్సిడెంట్స్ లో పలువురు మరణించారు. గాయాలు పాలు అయ్యారు. కాకినాడ జిల్లాలోని తాళ్లరేవు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. లచ్చా వారిపేట వద్ద ట్రాక్టర్ను బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదం లో బైక్ ఫై ఉన్న ముగ్గురు పెయింటర్లు సంఘటనా స్థలం లోనే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను రత్తవారిపేట వాసులుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలంలోని కీసర వద్ద మున్నేరు వాగులో ఈతకు దిగి ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. సెలవు రోజు ఎదో సరదాగా ఈత కొట్టేందుకు వచ్చి నీటిలో మునిగిపోయారు. అక్కడే ఉన్న స్నేహితులు కేకలు వేయడంతో.. గమనించిన స్థానికులు బయటకు తీశారు. అప్పటికే ముగ్గురు యువకులు మృతి చెందగా, మిగిలిన ఇద్దరిని నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్స్ తెలిపారు. ఇక హైదరాబాద్: నాంపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ భవనం లోని గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగి నాలుగు అంతస్తులకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదం లో దట్టమైన పొగ తో ఊపిరాడక 9 మంది మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. భవనంలోని గ్రౌం డ్ఫ్ ఫ్లోర్లో గ్యారేజ్ ఉండటంతో కారు రిపేర్ చేస్తుండగా మంటలు వచ్చా యి. అదే సమయంలో అక్కడ డీజిల్, కెమికల్ డ్రమ్ములు ఉండటం .. వాటికి మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగిపోయింది.
