సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తాజగా లేఖ రాశారు. అందులో.. పవన్ కళ్యాణ్ గారు.. నన్ను కాపు ఉద్యమాన్ని ఎదగటానికి వాడుకొన్నానని విమర్శించారు.నేను యువత ను అడ్డం పెట్టుకొని, రెచ్చగొట్టి ఎదగలేదు. నేను కాపునాడు ఉద్యమం ప్రారంభించక ముందు ఎప్పుడు ఓడిపోలేదు .. కాపు ల కోసం ఉద్యమం ప్రారంభించాకే ఓడిపోయాను అంటే ఎదిగానని అర్థమా ? కాపు నాడు అడ్డం పెట్టుకొని ఏ అధికార పార్టీ అధినేతను కానీ పవన్ ను కానీ కోట్ల రూపాయలు అడగలేదు.. ఏ అధికార పదవి పొందలేదు. కాపు ఉద్యమం చేస్తూ మేము కష్టాలు పడ్డప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? అని నేను అడగను.. తమరు బీజేపీ , టీడీపీ లతో కల్సి జనసేన కలిసి పోటీ చేస్తామని తరచూ అంటున్నారని.. అటువంటప్పుడు జనసేన పార్టీకి మద్దత్తు ఇవ్వాలని.. తనను ముఖ్యమంత్రిని చేయాలని ఎలా అడుగుతున్నారని ప్రశ్నించారు. 175 స్థానాలకు పోటీ చేసినప్పుడు ముఖ్యమంత్రిని చేయాలి అనే పదం వాడాలన్నారు. కలసి పోటీ చేసేటప్పుడు మీకు మీరే ముఖ్యమంత్రి అనుకోవడం హాస్వాస్పదమన్నారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి దొంగ అయినప్పుడు రెండు దఫాలు ఎమ్మెల్యేగా ఎందుకు గెలుపొందారో ఆలోచించాలని అన్నారు. 1988 నుండి ఆయన కాపు ఉద్యమానికి ఎన్నోసార్లు ఆర్ధికంగా , వందలాది వాహనాలు, లారీలు, పోస్టర్స్ సమకూర్చి సహకారం అందించారు. నా శ్రేయోభిలాషి అతనిపై ఏమిటి ఆ వీధి రౌడీ బాష ? ‘‘మీ ప్రసంగాలలో పదే పదే తొక్క తీస్తా, నార తీస్తా, క్రింద కూర్చోబెడతా, చెప్పుతో కొడతా, గుండు గీయిస్తా అంటున్నారు. ఇప్పటి వరకూ ఎంతమందికి తీయించి, క్రింద కూర్చోబెట్టారో, గుండ్లు ఎంతమందికి చేయించారో, ఎంతమందిని చెప్పుతో కొట్టారో సెలవివ్వాలి’’ అంటూ ముద్రగడ లేఖలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *