సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో తాజగా ఆరుగురు సభ్యుల కిడ్నాప్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గత రెండు రోజుల క్రితం వేమనీడు త్రినాధబాబు అనే యువకుడిని చాకచక్యంగా ముఠా కిడ్నాప్ చేసింది. తరువాత త్రినాధ్ బాబు తండ్రికి ఫోన్ చేసి లక్షన్నర రూపాయలను ముఠా డిమాండ్ చేసింది. ఈ కిడ్నాప్‌కు సంబంధించి త్రినాధ్ బాబు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు పన్నిన ప్యూహంలో కిడ్నపర్స్ దొరికిపోయారు. వారి ముఠాను అరెస్టు చేసి, త్రినాధ్ బాబును పోలీసులు అతని కుటుంబానికి అప్పగించారు. . కిడ్నాప్ ముఠాకు గుడిపూడి జగదీష్ అనే రౌడీ షీటర్ నేతృత్వం వహించినట్లు పోలీసులు ప్రకటించారు.
