సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లాల ఎస్ఐ అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షలు ఈనెల 14, 15 తేదీల్లో ఏలూరులోని ఐదు సెంటర్లలో నిర్వహిం చనున్నట్లు ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్‌కుమార్ తెలిపారు. ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. , ఈనెల 14న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్– 1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్– 2 పరీక్ష జరుగుతుంద న్నారు. 15న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్ –3, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్–4 పరీక్ష జరుగుతుందని ప్రకటించారు. . వట్లూరు సీఆర్ఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ, వట్లూరు సీఆర్ఆర్ పాలిటెక్నిక్ కాలేజీ, వట్లూరులో ఉన్న సీఆర్‌రెడ్డి మహిళా కళాశాల, ఏలూరులో ఉన్న సీఆర్‌రెడ్డి అటానమస్, డిగ్రీ కాలేజీ, ఏలూరులోని సెయింట్ థెరిస్సా కళాశాల (గవర్నమెంట్ ఆసుపత్రి ఎదురుగా)ల్లో పరీక్షలు జరుగుతాయని అన్నారు. మొత్తం 4,162 మంది అభ్యర్థులు ఎస్ఐ మెయిన్స్ పరీక్షలకు హాజరు కానున్నారని పేర్కొన్నారు. ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయని దళారుల గురించి తెలిస్తే డయల్ 100కు గాని, పోలీస్ స్టేషన్‌కు గాని సమాచారం తెలపాలన్నారు.
