సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏలూరు వద్ద జాతీయ రహదారిపై నేడు, బుధవారం తెల్లవారు జామున ఒకే సమయంలో రెండు వరుస రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఏలూరు శివారు జాతీయ రహదారిపై కాకినాడ నుండి గుంటూరు వెళుతున్న అల్ట్రా డీలక్స్ ఆర్టిసి బస్సు..ను వెనుక నుండి లారీ వచ్చి వేగంగా ఢీ కొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్న 12 మందికి గాయాలు అయ్యాయి. వారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో ప్రమాదంలో అదే జాతీయ రహదారిపై సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సును వెనుక నుండి కంటైనర్ లారీ ఢీ కొంది. సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సు విశాఖపట్నం నుండి విజయవాడ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నారు. వెనుక సీట్లలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఆర్టీసీ బస్సును ఢీకొన్న తర్వాత కంటైనర్ లారీ డ్రైవర్ , క్లీనర్ పరారయ్యారు. ఈ రెండు ఘటనలు ఒకే తరహాలో ఉండటం తో పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. ( up file photo)
