సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: 2 ఏళ్ళ విరామం తరువాత ఇటీవల దేశవ్యాప్తంగా ముఖ్యంగా కేరళలో కరోనా కేసులు ఎక్కువ నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. తెలుగు రాష్ట్రాలలో కూడా స్వల్పంగా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లాలో తొలి కొవిడ్–19 పాజిటివ్ కేసు నమోదైంది. ఏలూరు ఆశ్రం ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ వైద్యుడికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు ప్రకటించాయి. . ఆస్పత్రిలోని ఐసీయూ విబాగంలో పనిచేస్తున్న ఓ వైద్యుడికి ర్యాండమ్ టెస్టుచేయగా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఐసోలేషన్‌లో వున్న ఆ వైద్యునికి కొవిడ్ లక్షణాలేవీ లేవని, అయితే వైరస్ నిర్ధారణ పరీక్షలో మాత్రం పాజిటివ్ వచ్చిందని తెలిపాయి. ఐసోలేషన్‌లో వున్న వైద్యుని ఆరోగ్యస్థితి స్థిరంగానే ఉందని, ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని వైద్య అధికారులు భావిస్తున్నారు. .కాగా జిల్లాలో ప్రస్తుతం కొవిడ్ వైరస్ నిర్ధారణ కిట్‌లు లేనివిషయాన్ని డీఎంహెచ్‌వో కార్యాలయ అధికారులు రాష్ట్రా ప్రభుత్వం దృష్టికి తీసుకొనివెళ్ళగా నేడు, శుక్రవారం జిల్లాకు పదివేల కిట్‌లను పంపుతున్నారని సమాచారం..
