సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏలూరు నగరం, కేఆర్ పురంలో ఐటీడీఏ కార్యాలయంలో రేపు, గురువారం ( 20వ తేదీ) ఉదయం 10 గంటలకు నిరుద్యోగయువతీ,యువకులకు జాబ్ మేళ నిర్వ హిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి సి.మధుభూషణరావు ఒక ప్రకటనలో తెలియపారు. తిరుపతి జిల్లా శ్రీసిటీలోని మాండ్లెజ్ ఇండియాఫుడ్స్ లిమిటెడ్ (క్యాడ్ బరి చాకెలెట్ తయారీ) కంపెనీ ప్రతినిధులు వచ్చి అభ్యర్థులను ఇంటర్వ్యూ చేస్తారన్నారు. ఈ కంపెనీలో ట్రైనీగా పనిచేయుటకు ఇంటర్ లో 50 శాతం మార్కులతో పాస్ అయ్యిన 18–21 సంవత్సరాల వయస్సు గల యువతీయువకులు అర్హులన్నారు. ఇంటర్వ్యూలో అర్హత సాధించిన అభ్యర్థులకు నెలకు రూ.15 వేల జీతం, ఉన్నత చదువులకు కూడా సహకారం, ఇతర సదుపాయాలు కల్పిస్తారన్నారు. అలాగే శ్రీ సిటీలోని అపోలో టైర్స్ సంస్థలో ఉద్యోగం కోసం డిగ్రీ/డిప్లొమా/బీటెక్ లో ఉత్తీర్ణత్తీ తర్ణ పొందిన 18–23 సంవత్సరాలు వయస్సు గల అభ్యర్థులు అర్హులన్నారు. అర్హత సాధించిన అభ్యర్థులకు నెలకు రూ.16 వేల జీతం, సబ్సిడీపై ఇతర సదుపాయాలు ఉంటాయన్నారు. పూర్తీ వివరాల కోసం 88868 82032 సెల్ నంబర్ ను సంప్రదించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *