సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వివాహేతర సంబంధాలుతో ఎంతటి దారుణ మూల్యం చెల్లించాలో ఏలూరులో ఇద్దరి మృతికి కారణమైన తాజగా ఘటన మరోసారి నిరూపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు దక్షిణపు వీధికి చెందిన ఓ ఇంట్లో మహిళ హత్యకు గురైంది. కత్తితో పీక కోసి చంపేశారు. సమాచారం అందుకున్న వన్ టౌన్ సీఐ రాజశేఖర్ ఆదేశాల మేరకు ఎస్సై రామకృష్ణ సిబ్బందితో కలిసి అక్క డికి వెళ్లి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ప్రాధమిక దర్యాప్తు లో చెప్పిన వివరాలు ప్రకారం..మృతురాలు స్థానిక శనివారపుపేటకు చెందిన లారీ డ్రైవర్ భార్య.. ఉడతా సుజాత(30)గా గుర్తించారు.. ఆమె హత్యకు గురికాబడిన ఇంట్లో దిమ్మిటి సత్య నారాయణ(40) నివాసముంటున్నాడు. అతనికి వివాహమైనా భార్యతో గొడవలు రావడంతో అయిదేళ్ల గా ఒక్కడే ఉంటున్నాడు. పెయింటింగ్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. అతనితో హత్యకు గురైన సుజాత నాలుగేళ్లుగా సాన్నిహిత్యం పెంచుకొందని , ఇటీవల అతనిని దూరంగా పెడుతుండటంతో కక్ష పెంచుకొని గత ఆదివారం సాయంత్రం ఆమెను ఇంటికి పిలిపించుకొని కత్తి తో గొంతు కోసి చంపేసి తదుపరి సోమవారం ఉదయం తన సూసైడ్ కాగితం రాసి కిటికీలో పెట్టి ఇంటికి తాళం వేసి ద్వి చక్ర వాహనం పై బయటకు వెళ్లాడు. అలా నూజివీడు సమీపంలోకి చేరుకున్నాక బైక్ అక్కడ వదిలేసి రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ బ్రిడ్జి వద్ద రైలు కింద పడి ఆత్మ హత్య చేసుకొన్నాడు.అతని వివరాలుతో కాగితం జేబులో పెట్టుకోవడంతో పోలీసులు గుర్తించారు. అతని సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొన్నారు. మృతురాలు సుజాతకు భర్త, ఇద్దరు పిల్లలున్నారు. భర్త డ్యూటీకి వెళ్లినప్పుడు సుజాత సత్య నారాయణ ఇంటికి వెళ్లి వస్తుంటుంది. భర్త లారీడ్రైవర్ ఈ నెల 23న భోపాల్ వెళ్లారు. అతనికి పోలీసులు సమాచారం అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *