సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కేపీఎస్ కిశోర్ మీడియా సమావేసంలో మాట్లాడుతూ.. గత జనవరి 11వ తేదీఅర్ధరాత్రి ఏలూరు మెయిన్ బజార్‌లోని లోకేశ్వరి జ్యూవెలర్స్ అండ్ బ్యాంకర్స్ బంగారు షాపు గోడకు రంధ్రం చేసి వెండి, బంగారు ఆభరణాలు అపహరించిన నలుగురు దొంగలు ను పోలీసులు గ్రూపులుగా ఏర్పడి ప్యూహాత్మకంగా పట్టుకొన్నటు ప్రకటించారు. నిందితుల నుంచి 469 గ్రాముల బంగారం, 41 కేజీల వెండి వస్తువు లను స్వాధీనం చేసుకున్నామని వాటి విలువ రూ.75 లక్షలు ఉంటుందన్నారు. గత గురువారం తెల్లవారుజామున చొదిమెళ్ళ రోడ్డు పక్కన పొలాల్లో అనుమానాస్పదంగా ఉన్న ఉత్తర ప్రదేశ్‌కు చెందిన కుల్దీప్ శర్మ (24), మనోజ్ కుమార్ (35), మహేందర్‌సింగ్ (24), రాజేష్ కుసువాహ(టిటు) (39) అదుపులోకి తీసుకొన్నామన్నారు. వీరంతా ఏలూరులో ఉంటున్నారు. వీరందరూ గతంలో వివిధ నేరాల్లో జైలు శిక్షలు అనుభవిం చిన సమయంలో పరిచయమై ముఠాగా ఏర్పడి వివిధ రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారని విచారణలో తేలిందన్నారు. రాజేష్ ఏలూరులో బంగారపు వస్తువులు తయారు చేసే షాపులో పనిచేస్తున్నాడు.ఈ నేపథ్యంలో 2022లో కూడా వీరు 5 సభ్యుల ముఠాగా ఏర్పడి ఏలూరు నగరంలో పలు దొంగత నాలకు పాల్పడ్డారు.5వ సభ్యుడిని కూడా అరెస్టు చేస్తామన్నారు.
