సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏలూరులో నేడు, శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సనాతన ధర్మ పరిరక్షణ విభాగాన్ని జనసేన పార్టీ తరపున ప్రారంభిస్తున్నామని తెలిపారు. ‘‘నారసింహ వారాహి గణం’’ సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో ఏపీ, తెలంగాణాలో ప్రారంభిస్తున్నామని తెలిపారు. సనాతన ధర్మం ఉంటేనే తప్పా.. ఈ దేశం నిలబడదని ఉద్ఘాటించారు. ప్రతీ ఏడాది నిరుద్యోగ యువతకు డీఎస్సీ విడుదల చేయాలని మంత్రివర్గ సమావేశంలో చర్చించాం .వైసీపీ నేతలకు చింత చచ్చినా పులుపు చావలేదు. వైసీపీకి 11సీట్లువచ్చినా విమర్శలు మానలేదు. వైసీపీ నేతలకు నోరు ఎక్కువైంది. మీకు యుద్ధమే కావాలనుకుంటే సిద్ధమే..వైసీపీ నేతల మీద చర్యలు తీసుకునేటప్పుడు.. వారు రోడ్డెక్కితే, కాళ్లు చేతులు విరగొట్టి మూల కూర్చోబెడతాం. మొన్నటి ఎన్నికల్లో ఈవీఎంలు మోసం చేశాయని వాటితో కూటమి గెలిచిందని వైసీపీ నేతలు అంటున్నారు. వైసీపీకి 151 సీట్లు వచ్చినప్పుడు ఏమీ అనలేదు. రాష్ట్రంలో నేరాలు పెరిగాయి, శిక్షలు తగ్గాయి. పోలీసులకు డిజిటల్ క్రైమ్ యాక్టు తీసుకురాబోతున్నాం’’ అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.‘‘జగన్ సోదరి వైఎస్ షర్మిల ప్రాణాలకు రక్షణ కావాలని కూటమి ప్రభుత్వాన్ని కోరింది .. ఆమె ‘అన్న’లా కాకుండా మేము రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చాం.. పాఠశాలలు, కాలేజీలు, హాస్టళ్లలో ఆడబిడ్డల సంరక్షణ బాధ్యతలు పాఠశాలల మేనేజ్‌మెంట్, ప్రిన్సిపాల్స్‌వే. అన్నారు. కొల్లేరు ప్రాంతంలో టీడీపీ వారికీ జనసేన వారికీ మధ్య పింఛన్ల పంపిణీలో జరిగిన కొట్లాటలు పవన్ దృష్టికి జనసేన నేతలు తీసుకొనివచ్చారు.
