సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏలూరు పార్లమెంటరి పరిధిలో ఇటీవల బీజేపీ పార్టీ తన దూకుడు పెంచింది. ఇటీవల విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. నేడు, బుధవారం ఏలూరులోని 23వ డివిజన్ ఫిరంగుల దిబ్బ రామాలయం వద్ద ఏలూరు ప్రజా పోరు ఇంచార్జ్ నడపన దాన భాస్కరరావు అధ్యక్షతన ప్రజాపోరు వీధి సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి గా బీజేపీ ప్రజాపోరు గోదావరి జోనల్ ఇంచార్జ్ గారపాటి చౌదరి (తపన ఫౌండేషన్ ) హాజరై తన ప్రసంగంలో.. కరోనా కష్టకాలంలో దేశ ప్రజల ప్రాణాలు కాపాడినందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఉచితంగా టీకా మందు ప్రజలందరికీ అందజేస్తే మన రాష్ట్రంలో మాత్రం ప్రజలను మందుకు బానిసలు చేసి దానిపై వచ్చిన ఆదాయంపై రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడిందని విమర్శించారు. రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు రాక యువతకు ఉద్యోగ అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు యువత వలస వెళ్తున్నారని, గరీబ్ కళ్యాణి అన్న యోజన పేరుతో ప్రతి ఒక్కరికీ 5 కేజీలు చొప్పున ఉచితంగా బియ్యాన్ని ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఈ ప్రభుత్వానికి 2024 లో జరిగే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పవలసిన సమయం ఆసన్నమైందని, జనసేన, బిజెపి కూటమికి ప్రజలు బటన్ నొక్కి ఓటు వేయటం వేసి గెలిపించడం ద్వారా గుణపాఠం చెప్పాలని గారపాటి చౌదరి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *