సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల పోలీస్ ఎస్ ఐ అభ్యర్థులకు ప్రభుత్వం ప్రిలిమినరీ రాత పరీక్షలు నిర్వహించారు. వీటిలో ఏలూరు రేంజి పరిధిలో ఎంపికైన 9,689 అభ్యర్థులకు శరీర పిట్ నెస్ పరీక్షలను రేపటి శుక్రవారం నుండి (ఈ నెల 25 నుంచి సెప్టెంబరు 9 వరకు) ఏలూరులోని పోలీసు మైదానంలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్, ఎస్పీ మేరీ ప్రశాంతి అక్కడ ఏర్పాట్లను పరిశీలిం చారు. ఈ సందర్భంగా డీఐజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. అభ్యర్థులకు పిట్ నెస్ పరీక్షలు ను పారదర్శకంగా, సాంకేతికే పరిజ్ఙానం ఉపయోగించే నిర్వహిస్తామన్నారు. ఆయా ప్రాంతాల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేశామని, వైద్యసేవల కోసం అం బులెన్సు , వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతామన్నారు. అభ్య ర్థులు ఒరిజినల్ సెర్టిఫికెట్లు మాత్రమే అనుమతిస్తామన్నారు. అయితే మరో సెట్ జిరాక్సు పత్రాలు కూడా వెంట తీసుకురావాలని పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ మార్కుల జాబితా, కుల ధ్రువ పత్రం, క్రిమిలేయర్, 4 నుంచి 10 వరకు స్టడీ సర్టిఫికెట్లు వెంట తీసుకురావాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *