సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గతంతో పోలిస్తే ఈ ప్రబలుతున్న కరోనా వైరస్ అంత ప్రాణాంతకం కాదని వైద్య పరిశోధకులు పేర్కొంటున్నప్పటికీ ప్రజలు మాస్క్ లు ధరించి తగిన జాగ్రత్తలు తీసుకొంటే మంచిది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్‌లోనిన్న శనివారం 2 సెక్షన్స్ లలో సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా ఇక్కడ పనిచేస్తున్న ఐదుగురు ఉద్యోగులకు కోవిడ్ పాజిటివ్‌గా (Covid Positive) రిపోర్ట్ రావడంతో వారిని వెంటనే హోం ఐసోలేషన్‌కు తరలించారు. మిగిలిన సిబ్బందికి నెగెటివ్‌గా వచ్చింది. కలెక్టరేట్‌లో ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రావడంతో తోటి ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు.
