సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఉభయ గోదావరి జిల్లాలో గుట్కా ప్రియులకు ఎదో రకంగా ప్రభుత్వం నిషేదించినప్పటికీ గుట్కా లు యదేచ్చగా అందుబాటులో ఉంటున్నాయి. తాజాగా నేడు, గురువారం ఏలూరు జిల్లాలో నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మండవల్లి మండలం లోకమూడి ప్రధాన సెంటర్లో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 18,000 విలువ చేసే 2025 గుట్కా, కైని, విమల్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే దీని వెనుక ఇంకా భారీ మార్కెట్ దాగి ఉందని పోలీసులు దర్యాపు చేస్తున్నారు. ఈ నిషేదిత గుట్కా అమ్మకాలు చేస్తున్న వ్యక్తులు ఏలూరుకు చెందినవారిగా గుర్తించారు. ఇప్పటికే ఇద్దరిపై కేసు నమోదు చేసి మండవల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
