సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్ : కక్ష కార్పణ్యాల తో మనిషి మృగంలా,మారిపోతున్న దారుణ ఘటన నేడు, శనివారం సాయంత్రం ఏలూరు జిల్లా లో జరిగింది. కామవరపుకోట మండలం సాగిపాడు గ్రామంలో నేటి శనివారం సాయంత్రం పాత కక్షల నేపథ్యం లో 17 ఏళ్ళ వయస్సులో అభం శుభం తెలియని ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి సిద్ధార్థ ను అదే గ్రామానికి చెందిన బి.నాగరాజు కత్తితో దారుణంగా మెడపై నరికి హత్య చేశాడు. ఒకేచోట ఇరుగుపొరుగు ఇళ్లలో ఉండే వీరిద్దరికి కొద్దీ రోజుల క్రితం గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో నేటి సాయంత్రం మద్యం సేవించిన నాగరాజు కాలేజీ నుంచి వస్తున్న సిద్ధార్థను రోడ్డుపై అడ్డగించి కత్తితో నరికాడు. దీంతో సిద్దార్థ అక్కడికక్కడే మృతి చెందాడు. దీనితో ఆ ప్రాంతం తీవ్ర విషాదం నిండుకొంది. ఈవిషయం పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
