సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: దేశవ్యాప్తంగా మరల కోవిద్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా మాత్రం పరిస్థితి అదుపులో ఉంది. ఒకటి అర కేసులు వస్తున్నాయి. అయితే కొవిడ్ పాజిటివ్ కేసుల నమోదులో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు జిల్లా అగ్రస్థానంలో కొనసాగుతోంది. గత శనివారం రికార్డు స్థాయిలో నమోదైన 29 కొవిడ్ కేసులన్నీ ఏలూరు జిల్లాకు చెందినవే కావడం ఆందోళన కలిగించే అంశం. . చింతల పూడి రూరల్ పరిధిలో ఎనిమిది కేసులు నమోదవ్వగా,. ఉంగుటూరు, దెందులూరు మండలం దోసపాడు, రామారావుగూడెం, చాట్రాయి రూరల్‌లో చీపురుగూడెం, చాట్రాయిలలో ఒక్కొక్కటి, ముదినేపల్లి రూరల్‌లో ఆరు కేసులు నమోదు కాగా వీటిలో ముదినే పల్లిలో 3, పెదపాలపర్రులో 2, వాణిదేవులో ఒకటి నమోద య్యాయి. నూజివీడు రూరల్‌లో 7 కేసులు నమోదు కాగా వీటిలో పోలసానిపల్లిలో 4, నూజివీడు, తుక్కులూరు, వెస్ట్ దిగవల్లిలలో ఒక్కొక్కటి చొప్పున, ఏలూరు నగరం లోని శనివారపుపేట లో 2, కరెంట్ ఆఫీసులో ఒకటి, నమోదయ్యాయి.
