సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఏలూరు జిల్లా ప్రాజెక్టు ఆధ్వర్యంలో దివ్యాంగుల వైకల్యత్వాన్ని నిర్థారించేందుకు సమగ్రశిక్ష నేటి శనివారం నుండి (ఈ నెల 28) నుంచి ఫిబ్రవరి 4వరకు వైద్య నిపుణుల పర్యవేక్షణలో వైద్య శిబిరాలను ప్రారంభించినట్లు డీఈవో, ఎస్‌ఎస్‌ఏ అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ మధుసూదనరావు తెలిపారు. బుట్టాయి గూడెం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడె, పోలవరం, కామవరపుకోట, చింతలపూడి, జీలుగుమిల్లి, వేలేరుపాడు, కుకునూరు, టి.నరసాపురం మండలాలలకు చెందినవారికి ఈ నెల 28న జంగారెడ్డిగూడెంలోని జడ్పీ బాలుర హైస్కూలులో, 31న అగిరిపల్లి, నూజివీడు, చాట్రాయి, ముసునూరు మండలాల వారికి నూజివీడులోని ఎస్‌ఎస్‌ఆర్ జడ్పీ హైస్కూలులో శిబిరాలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 2న కైకలూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి మండలాలవారికి కైకలూరులోని భవిత సెంటర్‌లో, 4న భీమడోలు, ద్వారకాతిరుమల, దెందులూరు, ఏలూరు, పెదపాడు, పెదవేగి, గణపవరం, నిడమర్రు, ఉంగుటూరు, లింగపాలెం మండలాలవారికి ఏలూరు అశోకవర్ధన మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో వున్న భవిత సెంటర్‌లో శిబిరాలు నిర్వహిస్తామని వివరించారు. వైకల్య నిర్ధారణ జరిగిన తర్వాత వికలాంగులకు ఉపకరణాలను అందజేస్తామని తెలిపారు. తమ క్యాంప్‌నకు హాజరైన పిల్లలకు ఉచితభోజనము,వ్ వారి రవాణా ఖర్చులు ఇస్తామన్నారు.
