సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీఎం చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల కలెక్టర్లు తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఏలూరు జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటడం సమాచారం పై కలెక్టర్‌ కె.వెట్రిసెల్విని వివరణ కోరారు. అసలే మీవి ‘గోదావరి జిల్లాలు లో నీటి వనరులు పుష్కలంగా ఉంటాయి కదా? భూగర్భ నిల్వలు లేకపోవడమేమేమిటి? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అమరావతిలో బుధవారం ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో వెట్రిసెల్వి, జిల్లాకు చెందిన మంత్రి కొలుసు పార్థసారఽథిలు హాజర య్యా రు. జిల్లాలో వాటర్‌ టేబుల్‌ 16.92 మీటర్లకు పడి పోవడంపై ఏమీ చేస్తున్నారన్నారంటూ? కలెక్టర్‌ను సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. నవంబర్‌ నెలాఖరు తర్వాత వాటర్‌ ఆడిట్‌ చేసి, దానికి అనుగుణంగా భూగర్భ జలాలు వృద్ధికి చర్యలుండాల న్నారు. వెట్రిసెల్వి స్పందిస్తూ ప్రణాళికలు సిద్ధం చేసి త్వరలో అన్ని చర్యలు తీసుకుంటామని వెట్రిసెల్వి తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో 3 మీటర్లకు వాటర్‌ టేబుల్‌ను తీసు కురావాలని సీఎం సూచించారు జిల్లాలో . పశుగ్రాసం పెంచే అంశంపై డ్వాక్రా మహిళలను భాగస్వామ్యం చేయాలని సీఎం దిశా నిర్దేశం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *