సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఏలూరు జిల్లాలో వారం రోజులు క్రితం నూజివీడు ప్రాంతంలో 128 గోవులను అక్రమంగా హైదరాబాద్ తరలింపు సమాచారం మేరకు పోలీసులు వాటిని అడ్డుకొని నిందితులు పరారవ్వగా గోవులను గోసంరక్షణ శాలకు తరలించిన విషయం మరువక ముందే .. మరోసారి తాజాగా నూజివీడు మండలం లీలానగర్ గ్రామంలో అక్రమంగా నాలుగు డీసీఎం వాహనాల్లో తరలిస్తున్న 180 ఆవులను నూజివీడు రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకుని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఏలూరు, కృష్ణ జిల్లాలలోని పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్లో కబేళాలకు గోవులను తరలిస్తున్నారన్న సమాచారం మేరకు వాహనాలను స్వాధీన పరుచుకుని గుంటూరు గో సంరక్షణ శాలకు తరలించినట్లు రూరల్ ఎస్సై టి.రామకృష్ణ తెలిపారు. ఏది ఏమైనా గోవుల అక్రమ తరలింపు ఫై గోదావరి జిల్లాలలో కూడా హిందూ ఆధ్యాత్మిక వాదులు, పోలిసుల సమన్వయంతో గట్టి నిఘా ఉండవలసిన అవసరం ఉంది. up file photo
