సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏలూరు జిల్లాలో గత వారం రోజులు క్రితం తోలి కరోనా కేసు నమోదు అయిన విషయం విదితమే.. అయితే తాజాగా మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. కైకలూరు సమీపంలోని ముదినేపల్లి పీహెచ్ సీ పరిధిలోని 28 ఏళ్ల వ్యక్తి అనుమానిత లక్షణాలతో బాధ పడుతుండగా, విజయవాడలో టెస్టు చేయించుకోగా కొవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయిందని డీఎంహెచ్‌వో కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఆ వ్యక్తి హోం ఐసొలేషన్‌లో స్థానిక వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలలో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిద్ ఐసోలేషన్ వార్డు తిరిగి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. ఒకవేళ పాజిటివ్ కేసులు అధికంగా వస్తే ఎదుర్కోవడానికి వైద్యులు సన్నద్ధం అయ్యారు.
