సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు నగరంలో ప్రయాణికులకు మరి కొద్దీ నెలలు పాటు ప్రయాణాలలో ఇబ్బందులు తొలగేలా లేవు. ఎందుకంటే ఏలూరు జిల్లా వ్యాప్తంగా మరిన్ని రోజులు సిగ్నల్‌ సిస్టమ్‌, ఆటోమేటిక్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ ట్రాఫిక్‌ బాక్సులు ఆధునీకరణ పనులను కొనసాగించనున్నారు. ఏలూరు జిల్లాలో రోజుకు 130 నుంచి 140 రైళ్లు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఇప్పటి వరకు వంద కిలోమీటర్లు వేగం వెళ్లే కెపాసిటీ ఉన్న రైలు పట్టాలను 130 కిలోమీటర్ల వేగం ప్రయాణానికి పెంచారు. వీటిని మళ్ళీ ఇప్పుడు 160 కిలోమీటర్ల వేగంతో రైలు ప్రయాణించడానికి ట్రాక్‌లను సంసిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే గన్నవరం నుంచి విజయవాడ వరకు ఈ పనులన్నీ పూర్తి చేశారు. దానికి కొనసాగింపుగా ఈ నెలాఖరుకు ఏలూరు మీదుగా ట్రాక్‌ పనులు ప్రారంభించనున్నారు. .ప్రస్తుతం ఏలూరు జంక్షన్,మరియు పవర్ పేట స్టేషన్స్ మీదుగా 84 రైళ్ళు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిలో కూడా కొన్ని రైళ్లను కొద్ది రోజుల్లోనే రద్దు చేయనున్నారు. రాయగడ ఎక్స్‌ప్రెస్‌ను పూర్తిగా రద్దు చేశారు. సింహాద్రి రైలును కూడా పూర్తిగా శనివారం నుంచి రద్దు చేశారు. ఏలూరు మీదుగా వెళ్లే కోణార్క్‌, ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళను పూర్తిగా దారి మళ్ళించి నిడదవోలు, భీమవరం, కైకలూరు, గుడివాడ మీదుగా విజయవాడకు అటు ఇటు పంపిస్తున్నారు. అయితే ప్రయాణికుల రద్దీ మేరకు తాత్కాలికంగా వేసవి ప్రత్యేక రైళ్ళను పెంచుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *