సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏలూరు జిల్లా లోని గోపీనాథపట్నంలో నేడు, సోమవారం సీఎం చంద్రబాబు పర్యటనలో భాగంగా డిసెంబర్ నెల మొదటి రోజు వృదులకు వికలాంగులకు పింఛన్ ల పంపిణి ప్రారంభించారు. మహిళ నాగలక్ష్మికి ఆయన పెన్షన్ అందజేశారు. నల్లమాడులో స్టాళ్లను సీఎం, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు కలసి పరిశీలించారు. అనంతరం సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ.. రాష్ట్రంలో దిగ్విజయంగా ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ సూపర్ సిక్స్ పథకాలను సక్సెస్ చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిదని వ్యాఖ్యానించారు. ఏపీలో పింఛన్ల పంపిణీకి ఏడాదికి రూ.33వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, పింఛన్లకు ఏపీ కంటే ఏ రాష్ట్రం కూడా ఎక్కువ ఖర్చుపెట్టడం లేదని తెలిపారు. తాను, తన మిత్రుడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఒకే విధంగా ఆలోచిస్తామని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు.తమ ప్రభుత్వానికి కష్టాలు, అప్పులు ఉన్నాయని, ఆదాయం లేదని.. అయినా ఒకేసారి రూ.4వేలకు పింఛన్లు పెంచామని తెలిపారు. ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ని వేదికపైనే ప్రజాసమస్యలపై సిబ్బంది కనీస అవగాహన లేకుండా గ్రామసభకు నిర్లక్ష్యంగా ఎలా వచ్చారని సీఎం ప్రశ్నించారు. ఈగ్రామ సభఫై మీకు అవగాహనా లేదని మేమె ఏర్పాట్లు చేసుకున్నామని, తమ ప్రభుత్వం మొక్కుబడిగా గ్రామసభలు నిర్వహించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.
