సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏలూరు జిల్లాలో గత మే నెలలో సెల్‌ఫోన్లు పోగొట్టుకున్న వారు ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ నంబర్‌ 9550351100కు ఇచ్చిన ఫిర్యాదులపై 8వసారి సైబర్‌ క్రైం పోలీస్‌ ఏలూరు, సీసీఎస్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టి 36 లక్షల 46 వేల రూపాయల విలువైన 182 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ప్రకటించారు. ఏలూరు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడాఉ. ఫిర్యాదుదారుల మొబైల్‌ ఐఎంఈఐ నంబర్‌ ఆధారంగా గుర్తించామన్నారు. పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్‌ జిల్లా, అంబేడ్కర్‌ కోనసీమ, కృష్ణా, విశాఖపట్టణం, తెలంగాణ తదితర ప్రాంతాల్లో మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇప్పటివరకు 12 కేసులు నమోదు చేసి పది మంది నిందితులను అరెస్టు చేశామన్నారు. మొత్తం 1,828 ఫోన్లు పోయినట్లు ఫిర్యాదులు వస్తే, వాటిలో 1,003 ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ 2 కోట్ల ఐదు లక్షల 78 వేల 184 రూపాయలు ఉంటుందని తెలిపారు. సెల్‌ఫోన్ల రికవరీలో ప్రతిభ కనబర్చిన సీసీఎస్‌ సెల్‌ ట్రాకింగ్‌ హెచ్‌సీ సత్యనారాయణ, సైబర్‌ సెల్‌ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *