సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏలూరు జిల్లా లో కబేళాలకు అక్రమంగా గోవులను తరలిస్తున్న మూడు వాహనాలను గత రాత్రి అదుపులోకి తీసుకున్న నూజివీడు రూరల్‌ పోలీసులు వాటిని నేడు, బుధవారం పెదముత్తేవిలోని గో సంరక్షణ శాలకు తరలించి .. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నూజివీడు రూరల్‌ ఎస్సై టి.రామకృష్ణ వివరాల ప్రకారం హనుమాన్‌ జంక్షన్‌ నుంచి హైదరాబాద్‌లోని కబేళాకు మూడు వాహనాల్లో గోవులను తరలిస్తున్నారన్న సమాచారంతో నూజివీడు మండలం తుక్కులూరు వద్ద వాహనాలను నూజివీడు రూరల్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. మొత్తం మూడు వాహనాల్లో మానవత్వం లేకుండా క్రూరంగా కుకేసి ఏకంగా 120 గోవులను తరలిస్తుండగా, ముగ్గురు వాహన డ్రైవర్‌ లలో ఇద్దరు వాహనాలను వదిలి పారిపోయారని పోలీసులు అన్నారు. హిందూవాదులు ఈ ఘటనలో నిందుతులను పట్టుకొని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. up file photo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *