సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో సంచలనం కలిగించిన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి కటకటాల్లోకి వెళ్లారు. రోహిత్‌రెడ్డితోపాటు డ్రగ్స్ పార్టీలో పాల్గొని నిర్ధారణ పరీక్షలో పాజిటివ్‌గా తేలిన ఆయన సోదరుడు రితేశ్‌రెడ్డి, నమిత్‌శర్మకు కూడా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఈ ముగ్గురిని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. డ్రగ్స్ పార్టీలో , పోలీస్ లపై రివాల్వర్ తో కాల్పులు జరిపిన వ్యక్తి తో సహా మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకోగా.. వారిలో ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. వీరిలో ఏపీలోని ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ యాదవ్ కూడా పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించివేశారు. ఇదిలా ఉండగా తెలుగు దేశం పార్టీ లో దశాబ్దాలుగా అత్యంత కీలక నేత మాజీ మంత్రి, మాజీ అసెంబ్లీ స్పీకర్ యనమల రామకృష్ణుడు అల్లుడు మరియు ప్రస్తుత టీడీపీ పార్టీ మైదాకురు ఎమ్మెల్యే, తిరుమల దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ చైర్మెన్, పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు కావడం గమనార్హం.
