సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు ను ఊరిస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు మరికొద్ది రోజులలో ఉమ్మడి ‘పశ్చిమ గోదావరి’ జిల్లాలోని ఏలూరు, తాడేపల్లి గూడెం రైల్వే స్టేషన్ల మీదుగా పరుగులు పెట్టనుంది. వాల్తేరు డివిజన్‌కు ఈ రైలును కేటాయించనున్నారు. దీన్ని విశాఖ – విజయవాడ మధ్య డిసెంబర్ 2వ వారం నుండి నడిపేందుకు రైల్వే అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రైలు పట్టాల సామర్థ్యపరీక్షను గత రెండు రోజులుగా నిపుణుల బృందం పరిశీలిస్తోంది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ రైలు ఉమ్మడి జిల్లాల్లోని కేవలం తాడేపల్లిగూడెం, ఏలూరు స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. వందేభారత్ అయితే గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోనుంది. దీనివల్ల ప్రయాణ వ్యవధి మరింతగా తగ్గుతుంది. విజయవాడ నుంచి విశాఖపట్నంకు కేవలం 4 గంటల్లో చేరుకోవచ్చు. పూర్తిగా ఏసీ సదుపాయం కలిగి ఉంటుంది. ప్రయాణికులు బయటకొచ్చేందుకు నాలుగు అత్యవసర ద్వారాలు ఉంటాయి. ప్రతి కోచ్ బయట, లోపలా సీసీ కెమెరాలు ఉంటాయి. స్టేషన్ వచ్చేవరకు డోరు ఓపెన్ కాదు. కేవలం ఎనిమిది బోగీలతో నడిచే ఈ రైలు చైర్‌కార్ కాగా, ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లు మాత్రమే ఉంటాయి. టికెట్ ధరలు ఇంకా నిర్ణయించవలసి ఉంది.
