సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఏలూరులో ఏడేళ్ల తర్వాత 96 రోజుల పాటు జరిగే తూర్పు వీధి , పడమర విధి గంగానమ్మ జాతర.. ఏడేళ్ల తర్వాత పడమర విధి గంగానమ్మ జాతర ఇప్పటికే ప్రారంభమైంది. ప్రస్తుతం గంగానమ్మ అమ్మవారు గడప గడపకు ఊరేగుతూ ఆశీర్వాదాలు అందజేస్తున్నారు. అమ్మవారికి భక్తులు పసుపు నీళ్లతో ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. ఈ జాతర వచ్చే ఫిబ్రవరి 2న ముగుస్తుంది. ఈ మూడు నెలలు పాటు ఏలూరులో లక్షలాది మంది పాల్గొనే ఈ జాతరలో నేపథ్యంలో అక్కడి ప్రజలు కు పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు 3 నెలల పాటు నిషేధం. బందు ఇతరులను పిలువరు. అంతేకాదు కొత్త దుస్తులు కూడా ధరించరాదు. ఈసారి సంక్రాంతి పండగ కూడా ఏలూరు ప్రజలు చేసుకొరు. కులమతాలకు అతితరంగా ప్రజలందరూ ఒక్కటిగా ఈ ఆచారం పాటించడానికి ముందుకు రావడం గమనార్హం. ఫిబ్రవరి 1న శ్రీ గంగానమ్మకు ‘ప్రతి ఇంటి నుండి సమర్పించిన ప్రసాదం’తో మహా కుంభ నివేదన మరియు ఫిబ్రవరి 2న లక్షలాది మంది భక్తులతో ఊరేగింపు.. మధ్యాహ్నం నుండి కొర్ల బండిలో పంబాలమ్మను ఊరేగించి సాయంత్రం గ్రామా పొలిమేరలలో సాగనంపుతారు. ఫిబ్రవరి 1,2వ తేదీలలో మాత్రం ఏలూరులో ప్రతి ఇంతా బంధుమితృలతో కోలాహలం విందులు కలశాలతో అమ్మవారికి నైవేద్యాలు సమర్పించే మహిళా భక్తులతో ఏలూరు నగరం సందడిగా మారుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *