సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నేడు, శుక్రవారం కాంట్రాక్టు కార్మికుల ఆందోళనలతో ఉద్రిక్తత నెలకొంది. హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయేంద్ర ప్రసాద్ కాంట్రాక్టు కార్మికులను బూతులు తిట్టారని అందుకు క్షమాపణలు చెప్పాలని ఆరోపిస్తూ వారు విధులు బహిష్కరించి సూపరిడెంట్ కార్యాలయాన్ని చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. పోలీసులు రంగంలోకి దిగి వారిని సమన్వయ పరిచారు. అయితే ఆసుపత్రిలో రోగులకు పారిశుద్ధ్యం, సెక్యూరిటీ, అటెండర్ సేవలు నిలిచిపోయాయి.రోగులు ఇబ్బందులు కు గురిఅయ్యారు. ఒక్కసారిగా సుమారు 160 మంది ఉద్యోగులు విధులు బహిష్కారించారని తెలుస్తుంది. సూపరింటెండెంట్ డాక్టర్ విజయేంద్రప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన కొనసాగుతోంది. దీనిపై ఇంకా మరింత సమాచారం అందవలసి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *