సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా మరల కొవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా 4 కేసులు నమోదు(నిన్న విశాఖ లో 1 కడప జిల్లాలో 2కేసులు తో పాటునేడు, శనివారం నంద్యాల జిల్లా చాగలమర్రికి చెందిన 75 ఏళ్ల మహిళ కి కోవిద్ నిర్ధారించారు.)అయిన నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కొవిడ్ –19 అనుమానిత లక్షణాలతో వైద్యం కోసం వచ్చే రోగులకు వైరస్ టెస్టులు చేసేందుకు తాజగా ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ప్రత్యేక పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించారు. ఆసుపత్రి జనరల్ మెడిసిన్, ఔట్ పేషెంట్ విభాగాలకు వచ్చే రోగుల్లో ఎవరికైనా రొంప, జ్వరం, ఒళ్ళు నొప్పులతో కోవిద్ అనుమానిత లక్షణాలుంటే వారినుంచి శ్వాబ్‌ను ర్యాపిడ్ కిట్లతో సేకరించి వైరస్ నిర్ధారణకు వీఆర్‌డీఎల్ పరీక్షను చేసేందుకు ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌ను అందుబాటులోకి తెచ్చారు.
