సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఏలూరులో గత ఆదివారం మధ్యాహ్నం ఆరుబయట ఆడుకొంటున్న పదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ నేడు, మంగళవారం సుఖాంతమైంది. వివరాలలోకి వెళ్ళితే తంగెళ్ళమూడి లక్ష్మినగర్‌కు చెందిన రాజప్రోలు యశ్వంత్ (10)అనే బాలుడిని కిడ్నప్ చేసి విడుదల చేయడానికి కిడ్నాపర్లు మూడు లక్షలు డిమాండ్ చేశారు. ఏలూరు మార్కెట్ యార్డులో వాచ్‌మెన్‌గా పని చేస్తున్న తండ్రి రమేష్ తన వద్ద అంత డబ్బులేదని తమ బిడ్డను వదిలి పెట్టాలని ప్రాధేయపడ్డాడు. వారు ఒప్పుకోకపోవడంతో చివరకు నిన్న సోమవారం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. పోలీసులు ప్యూహాత్మకంగా బాలుడిని కిడ్నాపర్ల బారి నుండి రక్షించారు. కిడ్నాపర్లను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పూర్తీ సమాచారం అందవలసి ఉంది. up file photo
