సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల తెలుగు రాష్ట్రాలలో దూర ప్రయాణాలలో వరుస ఘోర బస్సు ప్రమాదాల నేపథ్యంలో గత రాత్రి 10 గంటలు దాటాక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న భారతి ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఏలూరు నుండి బయలు దేరిన 20 నిమిషాలలోనే లింగపాలెం మండలం జూబ్లీనగర్‌లో ఉహించనివిధంగా 50 మంది ప్రయాణికులు ఉన్న బస్సు బోల్తా కొట్టేసి పడిపోయింది. అదృష్టవశాత్తు ఇంత ఘోర ప్రమాదంలో ఒకరు మాత్రమే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమం గా ఉంది. పలువురు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఏలూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *