సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో బ్యాంకు కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న అటవీ శాఖ అధికారి సురేష్ కుమార్ ఫై నిన్న ఏసీబీ అధికారులు డాడీ చేసి 4 లక్షలు లంచం తీసుకొంటుండగా పట్టుకోవడం సంచలనం రేపింది. దీనిపై తాజగా.. ఏసీబీ డీఎస్పీ జీవీ కృష్ణారావు (ఏలూరు) తెలిపిన వివరాల ప్రకారం… నరసాపురం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్‌గా పని చేస్తున్న సాధు సురేష్‌కుమార్ ప్రస్తుతం భీమవరం ఇన్‌ఛార్జిగా కూడా పనిచేస్తున్నారు. ఇటీవల పాలకోడేరు మండలం శృంగవృక్షం గ్రామానికి చెందిన ఒక సామిల్లు నడిపే వ్యాపారి రెన్యువల్ కోసం సద రు ఆఫీసర్‌ను ఆశ్రయించగా అతడు రూ.4లక్షలు లంచం డిమాండ్ చేశాడు. లక్ష ఇస్తానని లేదాదఫదఫాలుగా ఇస్తానన్నా కూడా వినకపోవడంతో సామిల్లు యజమాని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దానితో పిర్యదు దారుడి తో వెళ్లి ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా అతడు రూ. 4 లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్నారు. అనంతరం భీమవరం పలు కార్యాలయాలను ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో సీఐ శ్రీనివాస్‌తోపాటు ఏసీబీ అధికారులు పాల్గొన్నారు.
