సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత శుక్రవారం ఉదయం చంద్రబాబు అరెస్ట్ తదుపరి నేటి ఆదివారం ఉదయం వరకు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో విజయవాడ ఏసీబీ న్యాయస్థానం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఆసక్తి కర అంశం ఏమిటంటే నిందితుల జాబితాలో సీఐడీ విజయవాడలోని కోర్టులో సమర్పించిన రిమాండ్ రిపోర్టులో నారా లోకేశ్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కే అచ్చెంనాయుడు పేర్లను కూడా పేర్కొంది. చంద్రబాబు సన్నిహితుడు కిలారు రాజేశ్ ద్వారా లోకేశ్‌కు స్కాములో ముడుపుల డబ్బులు అందినట్లు రిమాండ్ రిపోర్టులో సీఐడీ ఆరోపిస్తూ ఆధారాలను జతపరిచింది. ఇప్పటికే సీఐడీ తరఫు వాదనలు పూర్తి కాగా.. కొద్దిసేపటి క్రితమే టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు తరఫున దేశంలో అత్యంత ప్రఖ్యాత న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు ప్రారంభించారు రిమాండ్‌ను తిరస్కరించాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదిస్తుండగా, ఆయనను 15 రోజులపాటు కస్టడీకి అనుమతించాలని సీఐడీ తరపు న్యాయవాదులు కోరుతున్నారు. ఇరు పక్షాల వాదోపవాదాలు హోరాహోరీగా జరుగుతున్నాయి. ఈలోగా కోర్ట్ ఆవరణలో పోలీసులు భారీ కాన్వాయ్ ని సిద్ధం చేస్తుండటం ఎదో కీలక పరిణామం జరగబోతుందని సూచిస్తుంది.
