సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్‌ అయి రాజమండ్రి సెంట్రల్‌ జైలులో 50 రోజులు పూర్తీ చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఏసీబీ కోర్టు జడ్జికు లేఖ రాశారు. జైలు అధికారుల ద్వారా తాజగా.. ఏసీబీ జడ్జికి చంద్రబాబు 3 పేజీల లేఖ పంపారు. ఈ లేఖ ఆయన ఈ నెల 25న జడ్జికి టీడీపీ అధినేత లేఖ రాసినట్లు తెలుస్తుంది. చంద్రబాబు లేఖలోని ప్రధాన అంశాలు పరిశీలిస్తే …‘‘నాకు జెడ్ ప్లస్ సెక్యూర్టీ ఉంది. నేను జైల్లోకి వచ్చినప్పుడు అనధికారికంగా నన్ను వీడియోలు.. ఫొటోలు తీశారు. ఆ ఫుటేజ్‌ను స్వయంగా పోలీసులే లీక్ చేశారు. నా రెప్యూటేషన్‌ను దెబ్బ తీసేందుకే ఈ తరహా వీడియో ఫుటేజ్ రిలీజ్ చేశారు. నన్ను అంతం చేసేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్ర పన్నుతున్నారు. దీనికి సంబంధించిన లేఖను తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి ఈ విషయమై లేఖ కూడా వచ్చింది. ఆ లేఖపై ఇప్పటి వరకు పోలీస్ అధికారులు ఎలాంటి విచారణ చేపట్టలేదునా కదలికల కోసం జైలుపై అనధికారికంగా డ్రోన్లు ఎగరేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్లే ఈ డ్రోన్లు ఎగరేశారని భావిస్తున్నాను. డ్రోన్లు ఎగరేసిన ఘటనలోనూ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు. ఈ నెల 6న నన్ను కలవడానికి నా కుటుంబసభ్యులు వచ్చిన సందర్భంలో సెంట్రల్ జైలు మెయిన్ గేట్ వద్ద మరో డ్రోన్ ఎగరేశారు. నా భద్రతే కాదు.. నా కుటుంబ సభ్యులకు ప్రమాదం పొంచి ఉందనే ఆందోళనతో ఉన్నాను . ’’ అంటూ చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *