సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో మూడోసారి అధికారం చేపడుతామని ఎన్డీఏ కూటమి ఆశాభావంతో ఉంది. అయితే ఇప్పటికే జరిగిన 5 విడతల పోలింగ్ తరువాత గతంలో ప్రకటించిన 400 సీట్ల గెలుపు ధీమా వారిలో కనపడటం లేదన్నది విశ్లేషకుల వాదన..అయితే ఎన్డీయే ప్రభుత్వ అధికారానికి ఢోకా ఉండక పోవచ్చునని 270 నుండి 300 సీట్ల పైగా సాధించే అవకాశం ఉందని పలు సర్వే లు పేర్కొంటున్న నేపథ్యంలో నేడు, గురువారం ఢిల్లీలో ఆంధ్ర భవన్ లో భోజనానికి వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత, రాహుల్ గాంధీ మీడియా తో మాట్లాడుతూ…జూన్ 4వ తేదీన ఆశ్చర్యకర ఫలితాలు రాబోతున్నాయని ఆయన వివరించారు. ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం అంటున్నారు. ఢిల్లీలో ఉన్న 7 లోక్ సభ సీట్లను కూటమి గెలుచుకుంటుందని స్పష్టం చేశారు.ప్రధాని మోదీ, బీజేపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. భారత రాజ్యాంగం మార్చాలని బీజేపీ అనుకుంటుందని సందేహాం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల అంశం తెరపైకి తీసుకొచ్చారని, దేశ సంపద అదానీ, అంబానీ చేతిలో కేంద్రికృతమైందని రాహుల్ గాంధీ విమర్శించారు. ఎన్డీయే అధికారంలోకి వస్తే దేశంలో రిజర్వేషన్లను రద్దు చేస్తారని స్పష్టం చేశారు. దేశంలో 90 శాతం పేదలు ఉన్నారని వారు దేశంలో ఏం జరుగుతుందో గమనిస్తున్నారని తమ వజ్రాయుధం అయిన ఓటుతో తగిన బుద్ది చెపుతారని రాహుల్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *