సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇస్లామిక్ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో భారత్ తగిన సమాధానం ఇచ్చింది. పాకిస్తాన్ పౌరుల భద్రతపై ఐక్యరాజ్యసమితిలో జరిగిన చర్చలో పాక్ రాయబారి అసిమ్ ఇఫ్తికర్ అహ్మద్ మరోసారి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. సింధు జలాలను ఆపెయ్యడం మంచిది కాదని “నీరు ప్రజలకు జీవనానికి ఆధారం. యుద్ధానికి ఆయుధం కాదంటూ” ప్రసంగంలో వ్యాఖ్యానించారు. దీనిని ఐరాస భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ సభలోని సభ్యులు విస్తుపోయేలా పాక్ దుశ్చర్యలపై ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా 2008 ముంబై దాడులు, గత నెల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడులను ఉదహరిస్తూ..”భారతదేశం దశాబ్దాలుగా పాకిస్థాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రసంస్థల వల్లే ముప్పు ఎదుర్కొంటోంది. అది ముంబైలో 26/11 దాడి అయినా, 2025 ఏప్రిల్‌లో పహల్గామ్‌లో అమాయక పర్యాటకుల ఊచకోత అయినా సరే. వారి లక్ష్యం ఎల్లప్పుడూ సాధారణ పౌరులే” ఇప్పటివరకూ ఉగ్రవాదుల వల్ల 20 వేల మందికి పైగా పౌరులు అన్యాయంగా చనిపోయారని ఆరోపించారు. అటువంటి పాకిస్తాన్ పౌరుల భద్రత గురించి మాట్లాడటం అంతర్జాతీయ సమాజం ముఖం మీద చెంపదెబ్బ కొట్టినట్టే” అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. “ఉగ్రవాదానికి ప్రపంచ కేంద్రంగా” ఉన్న పాకిస్థాన్ సరిహద్దు ఉగ్రవాదానికి మద్ధతు ఇచ్చినంత వరకూ.. సింధూ జలాల ఒప్పంద రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని ఐరాస భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీష్ ఖరాకండిగా తేల్చిచెప్పారు.
