సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత్ పాక్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఐరాస భద్రతా మండలి లో తాజగా జరిగిన మీటింగులో సభ్య దేశాలు పాక్ తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశాయి. భారత్ ను మరింత రెచ్చగొట్టే విధంగా ఇటీవల పాక్ క్షిపణి ప్రయోగాలు చెయ్యడం ఫై పాకిస్తాన్ ఫై సభ్యదేశాలు ఆగ్రహం వ్యక్తం చేసాయి. భారత్ లోని కాశ్మిర్ లో పహల్గామ్ ఉగ్రవాద దాడులకు పాక్ బాధ్యత వహించాల్సిందేనని అన్నాయి. ఈ ఉగ్రవాదుల పాశవిక చర్యలపై పాక్ ఇప్పటికి స్వాందించక పోవడం తప్పు పట్టాయి. ప్రధాని మోదీ, విదేశాంగమంత్రి జైశంకర్ దౌత్యం ఫలించింది. ప్రధాని మోదీ అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా దేశాధినేతలతో మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే భారత్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేయాలన్న పాక్ డిమాండ్‌కు.. భద్రతా మండలి సభ్య దేశాలు ఒప్పుకోమని తేల్చి చెప్పాయి.పహల్గామ్ టెర్రర్ అటాక్ మీద చర్చ జరగకుండా ఉండేందుకు పాక్ సభ్యుడు అసిమ్ లిఫ్తికర్ అహ్మద్ తీవ్రంగా ప్రయత్నించాడు. ఇండియాపై తప్పుడు ఆరోపణలు చేశాడు. కాశ్మీర్ ప్రస్తావన కూడా తెచ్చాడు.ఈ సందర్భంగా సింధు జలాలపై కూడా చర్చ జరిగింది. భారత్ సింధు జలాలను పాకిస్తాన్‌కు వెళ్లకుండా ఆపడం.. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని అన్నాడు. అయితే, ఐరాస భద్రతా మండలి మీటింగ్ ఏ నిర్ణయం తీసుకోకుండానే సమావేశం ముగించింది.దీనితో పాకిస్తాన్ కు అంతర్జాతీయంగా పరాభవం ఎదురయ్యింది.
