సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 4 రోజులుగా వరుసగా లాభాలలో దూసుకొనిపోతున్న భారత స్టాక్ మార్కెట్ సూచీలు నేడు (ఫిబ్రవరి 12 గురువారం) భారీ నష్టాల పాలయ్యాయి. ఐటీ రంగంలో వచ్చిన భారీ అమ్మకాల ఒత్తిడి మార్కెట్లను కుంగదీసింది.ఐటీ రంగంలో ‘Anthropic Shock’: కృత్రిమ మేధ (AI) దిగ్గజం ఆంత్రోపిక్ (Anthropic) విడుదల చేసిన కొత్త టూల్ ‘క్లాడ్ కోవర్క్’ (Claude Cowork) ఐటీ సేవల రంగానికి సవాలుగా మారుతుందనే ఆందోళనతో Infosys, TCS, Wipro వంటి షేర్లు 4-5% వరకు పడిపోయాయి. బిఎస్ఈ సెన్సెక్స్ (BSE SENSEX) నేడు 558.72 పాయింట్లు (0.66%) పతనమై 83,674.92 వద్ద స్థిరపడింది. ఒక దశలో ఇది మరింత దిగువకు వెళ్ళినప్పటికీ, ముగింపు సమయానికి స్వల్పంగా కోలుకుంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ (NIFTY 50) సైతం 146.65 పాయింట్ల (0.57%) నష్టంతో 25,807.20 వద్ద ముగిసింది. 26 వేల మార్కును కోల్పోయిన తర్వాత నిఫ్టీలో అమ్మకాలు పెరిగాయి.
