సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఐటీఐ చదివిన నిరుద్యోగులకు శుభవార్త! ఆంధ్రప్రదేశ్‌లో APSRTC వివిధ ట్రేడ్‌లలో అప్రెంటీస్‌షిప్ కోసం ఐటీఐ చదివిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతుంది. తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలలోని ఆర్టీసీ డిపో గ్యారేజీల్లో డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, వెల్డర్ ట్రేడ్‌లలో ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు వచ్చే నెల 12లోపు ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. విజయనగరం వి.టి.అగ్రహారంలోని ఆర్టీసీ ఓనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ దగ్గర ధ్రువపత్రాల పరిశీలనకు వచ్చే నెల 14న ఉదయం 10 గంటలకు హాజరు కావాలని జిల్లా ప్రజారవాణా అధికారి వైఎస్ ఎన్ మూర్తి తెలిపారు. అభ్యర్థులు ధ్రువీకరణ (సర్టిఫికెట్ల వెరిఫికేషన్) సమయంలో రూ.118 ఫీజు చెల్లించి రసీదు పొందాలని సూచించారు. ఈ అప్రెంటీస్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకునే ఐటీఐ అభ్యర్థులకు.. ఏమైనా సందేహాలు ఉంటే 088922-294906 నంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవాలి.
