సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బీమవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత గ్రంధి శ్రీనివాస్ నివాసంపై ఐటీ శాఖ అధికారులు నేడు, బుధవారం ఉదయం నుండి నేటి సాయంత్రం వరకు కొనసాగుతున్న ఐటి దాడులు విషయం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ఈ దాడుల సమయంలో ఆయన నివాసంలో లేరు. అయన నేటి ఉదయమే కారు లో హైదరాబాద్ కు బయలు దేరి వెళ్లారు. ఐటి అధికారులు ఆయన ఇంటిలో సోదాలు కొనసాగుతూనే నివాసంలోని పలు గదులతోపాటు కార్యాలయంలో తనిఖీలు చేసారని తెలుస్తుంది. .. ఈ నేపథ్యంలో ఐటి అధికారులు గ్రంధి శ్రీనివాస్ కు ఫోన్ చేసే వెంటనే భీమవరం తిరిగి రావాలని తమకు రికార్డ్స్ తనిఖీలలో సహకరించాలని కోరారు. దీంతో మార్గ మధ్య నుంచి శ్రీనివాస్ తిరుగు ప్రయాణమయ్యారు. ఆ క్రమంలో భీమవరంలోని తన నివాసానికి గ్రంధి శ్రీనివాస్ చేరుకున్నారు. మరో ప్రక్క ఐటీ దాడుల విషయం తెలుసుకుని ఆయన అభిమానులు విశేషంగా ఆయన నివాసానికి తరలి వచ్చి గ్రంధి కి సంఘీభావం తెలపడానికి ప్రయత్నించారు. ఐటి సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఐటి అధికారులు తమ దర్యాప్తు లో ఏమి తేలిందో? ఎన్ని ప్రాంతాలలో సోదాలు చేసారో? ఇంకా అధికార ప్రకటన చెయ్యలేదు.
