సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: ఐటీ రిటర్ను వెరిఫై ప్రాసెస్‌ పూర్తి కానివాళ్ల కోసం నేడు, శనివారం శుభవార్త చెప్పింది ఆదాయ శాఖ. ఆన్‌లైన్‌లో ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేసిన టైంలో చాలామందికి కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆన్‌లైన్‌లో దాఖలు చేసిన తర్వాత రిటర్ను వెరిఫై చేయాల్సి ఉంటుంది. వెరిఫై చేయటం అంటే.. పాన్‌తో ఆధార్‌ అనుసంధానమై, సంతకం అవసరం లేకుండా ఓటీపీ ద్వారా పంపటం. అయితే, ఓటీపీ వచ్చిన తర్వాత, కూడా చాలామందికి గంటల తరబడి ప్రయత్నించినా వెరిఫై కాలేదు. ఈ కష్టాలను దృష్టిలో పెట్టుకుని గడువును 2022 ఫిబ్రవరి 28 వరకూ డిపార్ట్‌మెంటు పెంచింది. ఇది కేవలం వెరిఫికేషన్‌ పెండింగ్‌లో ఉన్న వారికి మాత్రమే. రిటర్నులు వేయడానికి పొడిగించినట్లు కాదు. అయితే ఏ కారణం వల్లనైనా కానివ్వండి.. గడువు తేదీ లోపల రిటర్ను వేయలేకపోతే ఆందోళన చెందనక్కరలేదు. . ఈ ఆలస్యానికి, తప్పిదానికి, కాలయాపనకు ఒక వెయ్యి రూపాయలు లేదా రూ. 5,000 పెనాల్టీగా విధిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *