సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీ లో తాజగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాలనను సీఎం చంద్రబాబు గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. కూటమి 150 రోజుల పాలన ఏపీ ప్రజల భవిష్యత్తు పట్ల నమ్మకాన్ని ఇచ్చిందని తెలిపారు. ఏపీ ఆర్థిక వ్యవస్థను ఒక ట్రిలియన్ డాలర్లకు తీర్చిదిద్దామని పవన్ కల్యాణ్ తెలిపారు. . ప్రతి నెల 1వ తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నామన్నారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు ఉంటాయని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.గత వైసీపీ పాలకులు”పాలసీ మేకర్, ముఖ్యమంత్రి. ఆయనను కూడా ఇబ్బంది పెట్టారు. జైల్లో పెట్టారు. 150 రోజుల పాలనపై సీఎం చంద్రబాబు చెప్పిన మాటలు నాలో ఉత్సాహం నింపాయి. నా ఉద్దేశ్యంలో ఐదేళ్లు కాదు మరో దశాబ్ద కాలం పాటు చంద్రబాబు నాయుడే ఏపీకి ముఖ్యమంత్రిగా ఉండాలని పవన్ కల్యాణ్ కోరారు.
