సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: సినిమాలో తరహాలో అనంతపురం లో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేసి, తెలుగు దేశం నేత, మాజీ ఎంపీ, జేసీ దివాకర్ రెడ్డి సోదరులకు, అప్పటి అధికార పార్టీని సైతం లెక్కచేయక మీసం మెలేసి సవాల్ విసిరారు గోరంట్ల మాధవ్.. తదుపరి పరిణామాలలో ఒత్తిడి తట్టుకోలేక తన ఉద్యోగానికి రాజీనామా చేసి, ys జగన్ అండతో వైసిపి పార్టీలో చేరి ఏకంగా ఎంపీ అయిపోయిన గోరంట్ల మాధవ్ అంటే తెలుగురాష్ట్రాలలో తెలియనివారు ఎవ్వరు ఉండరు. మరి ఇటీవల ఎంపీ గోరంట్ల మాధవ్, తనపై ఒక వర్గం మీడియాలో ప్రచారంలో ఉన్న న్యూడ్ వీడియోలు ఫేక్ అని ..వాటిని విచారించి అవి తయారు చేసి తనపై కుట్ర చేసినవారిఫై చర్యలు తీసుకోవాలని సిఐడి కి చేసిన విజ్ఞప్తి మేరకు వారు విచారం జరిపి .. అవి ఫేక్ అని, మాపింగ్ వీడియోలు అని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆ వీడియోలు ప్రచారంలోకి తెచ్చినట్లు భావిస్తున్న “ఐ టీడీపీ “సంస్థ తో సహా పలువురిఫై సీఐడీ తాజాగా కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించింది.
