సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రముఖ సీనియర్ నటి, ఒకనాటి అందాల కథానాయక బీ సరోజా దేవి నేడు, సోమవారం కన్నుమూశారు. బెంగళూరు, యశవంతపురలోని మణిపాల్ ఆస్పత్రిలోఆమె గత కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే 87 ఏళ్ల వయసులో కన్నుమూశారు. సరోజా దేవీ 1938 జనవరి 7వ తేదీన బెంగళూరులో జన్మించారు. 1955లో విడుదలైన ‘మహాకవి కాళిదాసు’ వంటి సూపర్ హిట్ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. రెండేళ్ల తర్వాత ‘1957’లో ‘పాండురంగ మహాత్యం’ సినిమాతో ఎన్టీఆర్ తో చేసిన దేవ కన్యగా ‘జగదేకవీరుని‘ కధ తదితర తెలుగు సినిమాలు నాగార్జున తల్లిగా ‘ప్రేమ యుద్ధం’ సినిమాలు తో చిరస్మరణీయురాలిగా నిలచింది. ఆమె దక్షిణాది బాషలలో 200 పైగా సినిమాలు చేసారు. దక్షిణాది సినీ పరిశ్రమ రాజకీయ ప్రముఖులు ఆమె మృతికి తీవ్ర సంతాపం తెలుపుతున్నారు.
