సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పశ్చిమ గోదావరి జిల్లాలో నెలవారీ వృద్దులకు, వికలాంగులకు రోగులకు తదితర పింఛన్లను ఈసారి ఒకరోజు ముందే లబ్ధిదారులకు అందించడానికి వార్డు సచివాలయ అధికారులు ఏర్పాట్లు చేసుకొంటున్నారు. కొందరు అనర్హులయిన లబ్ది దారుల కార్డ్స్ తొలగించాక ఈసారి పశ్చిమ గోదావరి జిల్లాలో 2లక్షల 31వేల 075 మందికి రూ.96 కోట్ల96 లక్షలు పంపిణీ చెయ్యనున్నారు. ఇందుకోసం 4,428 మంది సిబ్బందిని వినియోగించనున్నారు. వీరితోపాటుగా పింఛన్ల పంపిణీ పరిశీలనకు కమిషనర్లు ఎంపీడీవోలు, తహసీల్దార్లతోపాటు ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమించారు. నేడు శుక్రవారంనాడు సచివాలయాలవారీగా నగదును అందించనున్నారు. జిల్లా కలెక్టర్ సి నాగరాణి ఆదేశాలతో రేపు శనివారం ( 31వ తేదీన) ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం లోగ 100 శాతం పింఛన్ పంపిణీ పూర్తీ చెయ్యాలని అధికారులు సంసిద్ధం అవుతున్నారు.
