సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎట్టకేలకు తిరుపతిలో అనేక హైడ్రామాలా నడుమ కూటమి అభ్యర్థి డెప్యూటీ మేయర్ పదవి కైవసం చేసుకొన్నారు.దీనిపై వైసీపీ మాజీ ఎమెల్య భూమన మీడియాతో మాట్లాడుతూ..ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో గత 7 రోజులుగా విద్వంస కాండ సృష్టించారని కూటమి ప్రభుత్వం కాన్సర్ కన్నా ప్రమాదకారులని, గతంలో రాష్ట్రంలో ఎప్పుడు జరగని రచ్చ కిడ్నప్ లు తో కూటమి ప్రభుత్వము, ఆఖరికి వైసీపీ ఎమ్మెల్సీ ని కూడా కిడ్నప్ చేసే స్థాయికి దిగజారిపోయింది అని , మొత్తం 50 మంది కార్పొరేటర్లు ఉన్న తిరుపతిలో 48 మంది వైసీపీ కార్పొరేట్ సభ్యులు ఉంటె ఒక్క కార్పొరేటర్ బలమే ఉన్న టీడీపీ డిప్యూటీ మేయర్ పదవి కైవసం చేసుకొందంటే .. చంద్రబాబు ప్రభుత్వం ఇంత నీచంగా వ్యవహరించాలా? ఎందరి వైసీపీ కార్పొరేటర్లు ఆస్తులు ధ్వసం చేసిందో, వైసీపీ సభ్యులను బెదిరించి, కిడ్నప్లు చేసి, అర్థరాత్రి పూట మహిళా కార్పొరేటర్లు ఉన్న గదికి వెళ్లి దౌర్జన్యం చేశారని,మరి ఇంత అరాచకంగా గెలవడం దానికి ఎన్నికల సంఘం అధికారులు స్వాదించకుండా ఉండిపోవడం ఆవేదన కలిగిస్తుందని మండిపడ్డారు. ఈ సందర్భంగా తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి వైసీపీ కార్పొరేటర్లను భయబ్రాంతులకు గురి చేసే విధంగా నిబంధనలకు విరుద్ధంగా అప్రజాస్వామిక పద్ధతిలో కూటంమి ప్రభుత్వం కుట్రలకు తెరతీసిందని, అధికారమే పరమావధిగా చెలరేగిపోతున్నారని మండిపడ్డారు.
