సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర వ్యాప్తంగాఇటీవల 2వారాలుగా భారీగా పెరిగిన నిమ్మ కాయల ధర లు ఒక్కసారిగా తగ్గిపోయాయి. నాలుగురోజుల క్రితం హోల్ సెల్ గా కిలో రూ.80 నుంచి రూ.130 వరకు ధర పలికిన నిమ్మకాయలు గత శుక్రవారం కిలో రూ. 30 నుంచి రూ.90 మాత్రమే పలికాయి. రిటైల్ గా నిమ్మ బండ్ల వద్ద 10 రూపాయలు 2 కాయలు ఇవ్వడం కష్టంగా మారిన పరిస్థితి నుండి గతంలో లాగా 10 రూపాయలుకు 4 నుండి 5 నిమ్మకాయలు ఇచ్చే పరిస్థితి వచ్చేసింది. నెల్లూరు నుండి నిమ్మ పంట విశేషంగా వచ్చే గూడూరు మార్కెట్‌లో టిక్కీ బస్తా రూ.1500కు, లూజుబస్తా రూ.7,200కు వ్యాపారులు కొనుగోలు చేశారు.వర్షాలు పడుతుండటంతో పెరిగిన ధరలు2 వారాలలోపే పడిపోవడంతో నిమ్మ రైతులు దిగాలు చెందుతున్నారు.
