సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో శుభ కార్యక్రమాల సీజన్ నడుస్తున్నప్పటికీ .. పశ్చిమాసియా లో యుద్ధం నేపథ్యంలో భారత దేశంలో బంగారం ( gold) ధరలు రోజురోజుకు భారీగా తగ్గుతున్నాయి. నేడు, శనివారం బంగారం ధరలు భారీగా పడిపోయాయి. గత శుక్రవారం (మార్చ్ 20) విజయవాడ, హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,910 రూపాయలు.. 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,36,550 రూపాయలు ఉండగా నేడు, శనివారం ఉదయం బంగారం ధర. 10 గ్రాముల 24 క్యారెట్ బంగారంపై 2,940 రూపాయలు.. 22 క్యారెట్ బంగారంపై 2,750 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,970 రూపాయల దగ్గర.. 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ.1,33,800 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. వెండి (silver)ధరలు కూడా భారీగా తగ్గాయి. నిన్న కిలో వెండి 2,60,000 రూపాయలు ఉండగా నేడు, శనివారం కిలోపై ఏకంగా 10 వేల రూపాయలు తగ్గి ప్రస్తుతం కిలో వెండి 2,50,000 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *